Donald Trump: శంఖాలు ఊదుతూ.. డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో స్వాగతం... అబ్బురపడిన ట్రంప్!

Grand Welcome for Trump

  • ట్రంప్ కు స్వాగతం పలికిన నరేంద్ర మోదీ
  • తనకు లభించిన స్వాగతాన్ని చూస్తూ సాగిన ట్రంప్
  • బయలుదేరిన బీస్ట్

ఇండియాలో కాలుమోపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అద్భుత రీతిలో స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టులో ఎయిర్ ఫోర్స్ వన్ విమానం నుంచి దిగిన ట్రంప్ కు, తొలుత స్వాగతం పలికి నరేంద్ర మోదీ, కరచాలనం, ఆలింగనాలతో ఆహ్వానం పలుకగా, ఆపై, భారత సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తూ సాగిన ఆహ్వాన కార్యక్రమం ట్రంప్ ను అబ్బరపరిచింది.

శంఖాలు ఊదుతూ, డప్పు వాయిద్యాలు వాయిస్తూ, సంప్రదాయ నృత్యాలతో, గరగాటాలతో పలువురు ట్రంప్ కు స్వాగతం పలుకుతూ ఉంటే, వారందరినీ ఆశ్చర్యపూర్వకంగా చూస్తూ ట్రంప్ ముందుకు సాగారు. ఆపై యూఎస్ నుంచి వార్ షిప్ లో తెచ్చిన బీస్ట్ వాహనంలో మొతేరా స్టేడియంకు ఆయన పయనం అయ్యారు.

Donald Trump
Welcome
India
Narendra Modi
  • Loading...

More Telugu News