Mahesh Babu: పరశురామ్ ను లైన్లో పెట్టిన మహేశ్ బాబు?

Parashuram Movie

  • పరశురామ్ కి మహేశ్ గ్రీన్ సిగ్నల్ 
  •  ఆలస్యం కానున్న 'నాగేశ్వర రావ్' ప్రాజెక్ట్
  • ఈ ఏడాదిలోనే విడుదల చేసే ఆలోచన

వంశీ పైడిపల్లి నుంచి 'మహర్షి' హిట్ ను అందుకున్న మహేశ్ బాబు, ఆయనతో మరో సినిమాను చేయాలనుకున్నాడు. 'సరిలేరు నీకెవ్వరు' పూర్తయ్యేలోగా పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకోమని వంశీ పైడిపల్లికి చెప్పాడు. వంశీ పైడిపల్లి అలాగే చేశాడు .. అయితే స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో మహేశ్ ను సంతృప్తి పరచలేకపోయింది. అందువలన అయన మార్పులు .. చేర్పులు చెప్పాడు. అవన్నీ సరిచేయడానికి వంశీ పైడిపల్లికి చాలా సమయం పడుతుందట.

ఈలోగా మహేశ్ .. పరశురామ్ ను లైన్లో పెడుతున్నటుగా సమాచారం. పరశురామ్ ఆల్రెడీ మహేశ్ కి ఒక కథ చెప్పడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. వంశీ పైడిపల్లి సినిమా తరువాత పరశురామ్ తో చేయవలసి వుంది. ఈ కారణంగానే చైతూతో 'నాగేశ్వర రావ్' చేయడానికి పరశురామ్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు మహేశ్ బాబు నుంచి కబురు వచ్చేయడంతో, ముందుగా పరశురామ్ ఆ ప్రాజెక్టునే పట్టాలెక్కించనున్నాడని అంటున్నారు. మహేశ్ తో పరశురామ్ మూవీని మైత్రీవారు నిర్మిస్తారనీ, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.

Mahesh Babu
Vamshi Paidipalli
Parashuram Movie
  • Loading...

More Telugu News