Uttar Pradesh: నోట్లో వేలు పెట్టి ఎంగిలితో పేజీలు తిప్పకండి: ఉద్యోగులకు ఉన్నతాధికారి ఆదేశాలు

up officer orders to government employees

  • ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారి
  • అంటు వ్యాధులు వస్తాయని హెచ్చరిక
  • స్పాంజ్‌లను వాడాలని సూచన

పేజీలను తిప్పడానికి నోట్లో వేలిని పెట్టి తడి చేసుకుని తిప్పుతుంటారు చాలా మంది. అయితే, దీని వల్ల అంటు వ్యాధులు వచ్చే ప్రమాదముంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇటువంటి అలవాటు ఉన్నవారు అధికమే. దీంతో ఓ ఉన్నతాధికారికి కోపం వచ్చింది. డాక్యుమెంట్లు, పేజీలను తిప్పటానికి ఎంగిలి ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
             
రాయబరేలీ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ అభిషేక్‌ గోయల్ ఇచ్చిన ఈ ఆదేశాలకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. ఎంగిలి వినియోగించి పేజీలను తిప్పే అలవాటు మానేస్తే అంటురోగాలను నివారించొచ్చనే ఉద్దేశంతోనే తాను ఇలాంటి ఆదేశాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వాటర్‌ స్పాంజ్‌లను మాత్రమే వాడాలని చెప్పారు.

  • Loading...

More Telugu News