Donald Trump: భారత గగనతలంలోకి ఎయిర్ ఫోర్స్ వన్... రూట్ క్లియర్!

Route Clear for Airforce One

  • ఘనంగా స్వాగత ఏర్పాట్లు
  • మరే విమానం ల్యాండింగ్ కు అనుమతివ్వని ఎయిర్ పోర్టు
  • మిగతా సర్వీసుల షెడ్యూల్ మార్పు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు స్వాగతం పలికేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఆయనకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, ఇతర మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. మరోవైపు భారత గగనతలంపైకి ట్రంప్ విమానం చేరుకోవడంతో, ఆ విమానానికి రూట్ క్లియరెన్స్ ఇచ్చారు.

మరో గంట పాటు అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మరే ఇతర విమానం ల్యాండింగ్ లేదా టేకాఫ్ నకు అనుమతి లేదు. ఈ సమయంలో ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సిన విమానాల షెడ్యూల్ ను స్వల్పంగా మార్చారు. ఎయిర్ పోర్టులో ట్రంప్ కు స్వాగతం పలికేందుకు పలువురు యూఎస్ ఎంబసీ అధికారులతో పాటు కేంద్ర మంత్రులు సిద్ధంగా ఉన్నారు.

Donald Trump
Airforce One
Route Clear
  • Loading...

More Telugu News