IYR Krishna Rao: జేసీబీని ఇలా కూడా వాడేయొచ్చా?.. నవ్వులు పూయించే వీడియో పోస్ట్ చేసిన ఐవైఆర్ కృష్ణారావు

Inventions become useful as people start innovating

  • డీసీఎంలోంచి కిందకు దిగేందుకు జేసీబీని వాడిన మహిళలు
  • గుజరాత్‌లో ఘటన
  • వారి ఐడియాను మెచ్చుకున్న ఐవైఆర్

ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు సంబంధించిన విషయాలు పోస్టు చేస్తూ, విమర్శలు, సెటైర్లు కురిపించే ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ రోజు తన శైలికి విభిన్నంగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసి నవ్వులు పూయించారు. జేసీబీని దేని కోసం వాడతాం? ఇళ్లను కూల్చడానికి, బండరాళ్లను ఎత్తి పారేయడానికి, మట్టిని తవ్వడానికి ఇలా అనేక విషయాలకు వాడుతుంటాం.

అయితే, గుజరాత్‌లో మాత్రం కొందరు మహిళలు తాము డీసీఎంలోంచి కిందకు దిగేందుకు జేసీబీని వాడేశారు. ఆ సమయంలో నవ్వు ఆపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి పోస్ట్ చేస్తూ.. 'జేసీబీని కనిపెట్టిన వ్యక్తి ఎన్నడూ గుజరాత్‌లో పర్యటించకపోయుండొచ్చు.. తన ఆవిష్కరణను ఇలా వినియోగించుకుంటారని ఎన్నడూ ఊహించకపోవచ్చు' అని ట్వీట్ చేశారు.

దీన్ని రీట్వీట్ చేసిన ఐవైఆర్ కృష్ణారావు 'ఆవిష్కరణలకు ప్రజలు మార్పులు చేస్తే ఆ ఆవిష్కరణలు మరింత అద్భుతంగా ఉంటాయి' అని పేర్కొన్నారు.

IYR Krishna Rao
Andhra Pradesh
Twitter
Viral Videos
  • Loading...

More Telugu News