Ventadri Express: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. భయంతో ప్రయాణికుల కేకలు

Venkatadri express misses big accident in chittoor

  • చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ఘటన
  • కప్లింగ్ ఊడిపోవడంతో ఇంజిన్ నుంచి వేరైన బోగీలు
  • భయంతో కేకలు వేసిన ప్రయాణికులు

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైలు కప్లింగ్ లింక్ ఊడిపోవడంతో ఇంజిన్ నుంచి ఏసీ, జనరల్, స్లీపర్ క్లాస్ బోగీలు వేరయ్యాయి. లోకోపైలట్ గుర్తించే సరికే ఇంజిన్ అరకిలోమీటరు ముందుకు వచ్చేసింది. మరోవైపు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోవడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని మామండూరు వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసి రైలును పంపించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Ventadri Express
Chittoor District
Train Accident
Andhra Pradesh
  • Loading...

More Telugu News