Hyderabad: కుక్క అడ్డు వస్తే తప్పించబోయి.. కిందపడి మరణించిన హైదరాబాద్ యువకుడు!

Biker Died in Road Accident in Hyderabad

  • జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద ప్రమాదం
  • శునకాన్ని తప్పించాలని చూడగా అదుపు తప్పిన బైక్
  • మరో బైకర్ కూ గాయాలు

హైదరాబాద్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద జరిగిన ఓ ప్రమాదం యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. బైక్ పై వస్తున్న ఓ యువకుడికి రోడ్డు దాటాలని ప్రయత్నిస్తున్న శునకం ఎదురుగా రావడంతో, దాన్ని తప్పించాలన్న ఆలోచనలో బ్రేక్ వేయగా, బైక్ అదుపు తప్పి పడింది.

ఆ బైక్ రోడ్డు డివైడర్ ను ఢీకొనగా, దాన్ని నడుపుతున్న వ్యక్తి తల డివైడర్ కు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఇదే ప్రమాదంలో రోడ్డు దాటుతున్న శునకం కూడా మరణించగా, వెనుకే వస్తున్న మరో బైకర్ కు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని, యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన మరో యువకుడిని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.

Hyderabad
Biker
Dog
Died
Police
  • Loading...

More Telugu News