Donald Trump: 24 సంవత్సరాల వయసు తేడా... ట్రంప్, మెలానియాల లవ్ స్టోరీ ఇది!

Donald Trump and Melania Love Story

  • న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో మొదలైన ప్రేమకథ
  • వెంటపడి మరీ మెలానియా మనసు గెలుచుకున్న ట్రంప్
  • తన భర్తది చిన్నపిల్లాడి మనస్తత్వమంటున్న మెలానియా

అమెరికా అధ్యక్ష హోదాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఇండియాలో పర్యటిస్తుండగా, ఆయన భార్య, యూఎస్ ప్రధమ మహిళ మెలానియా కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి లవ్ స్టోరీని ఓ మారు గుర్తు చేసుకుంటే...

 అది 1998. అతని వయసు 52 సంవత్సరాలు. ఆమెకు 28 మాత్రమే. ఇద్దరి మధ్యా 24 ఏళ్లు తేడా. ఓ వ్యాపారవేత్తగా రాణిస్తున్న డొనాల్డ్ ట్రంప్, అప్పటికే రెండో వివాహం చేసుకుని, ఆమెను కూడా వదిలేసి విడిగా ఉంటున్నారు. ఆమె స్లొవేనియాకు చెందిన మోడల్ మెలానియా. న్యూయార్క్ లో జరుగుతున్న ఫ్యాషన్ వీక్ కు వచ్చారు. ఆ సమయంలో ఆమెను చూసిన వెంటనే ట్రంప్ మనసు పారేసుకున్నారు.

తన పక్కనే సెలీనా మిడెల్ ఫార్ట్ అనే అమ్మాయిని కూర్చోబెట్టుకొని, మెలానియా ఫోన్ నంబర్ ను ట్రంప్ అడిగారట. పక్కన ఓ అమ్మాయిని పెట్టుకుని, మరో అమ్మాయి నంబర్ అడుగుతావా? అంటూ కోపంతో మెలానియా వెళ్లిపోయారు. అయినా ట్రంప్ ఆమెను వదల్లేదు.

మెలానియా ఎక్కడికి వెళితే, అక్కడికి వెళ్లేవారు. మొదట్లో అతని ప్రేమకు ఓకే చెప్పిన మెలానియా తర్వాత మళ్లీ కాదంది. మళ్లీ ఓకే చెప్పింది. తొలిసారిగా హోవార్డ్ స్టెర్న్ టీవీ షోలో వీరి మధ్య నడుస్తున్న ప్రేమ వ్యవహారం బయటకు తెలిసింది. 2005లో తమ మధ్య ఉన్న సంబంధాన్ని ట్రంప్ స్వయంగా బయటపెట్టారు. అప్పటికే తమ ఎంగేజ్ మెంట్ జరిగిందన్నారు.

ఇక వీరిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం ఆమెకు యూఎస్ పౌరసత్వం కూడా లభించింది. 2006లో మెలానియాకు కుమారుడు జన్మించాడు. మెలానియా బహుభాషా కోవిదురాలు. స్లొవేనియా, ఫ్రెంచ్, సెర్బియా, ఇంగ్లీష్, జర్మన్ భాషల్లో మాట్లాడతారు. భర్తకు అన్నింటా చేదోడు వాదోడుగా వుంటారు.

భర్తపై లైంగిక ఆరోపణలు వెల్లువలా వచ్చి పడుతున్న వేళ, స్థిరచిత్తంతో అండగా నిలిచారు. సెన్సేషన్ కోసం తన భర్తను మీడియా మాట్లాడిస్తుందని, ఆయనకై ఆయన మాట్లాడరని అంటుంటారు. ఆడవాళ్ల విషయంలో అందరు అబ్బాయిల మాదిరిగానే తన భర్త కూడా గొప్పలు చెప్పుకుంటారని, ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వమని వెనకేసుకొస్తారు. భర్త కూడా తనకు కొడుకులాంటివాడని చెబుతారు.

Donald Trump
Melania Trump
Love Story
India
Tour
  • Loading...

More Telugu News