Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Producers angree with Nayanatara

  • నయనతారపై గుర్రుగా వున్న నిర్మాతలు 
  • బాలకృష్ణకు ఇద్దరు హీరోయిన్ల ఖరారు 
  • హిందీలోకి సూర్య సినిమా రీమేక్  

 *  భారీ పారితోషికం తీసుకునే కథానాయిక నయనతార సిబ్బంది ఖర్చు విషయంలో తమిళనాడు నిర్మాతలు గుర్రుగా వున్నారు. వ్యక్తిగత సహాయకులతో కలిపి ఆమెకు సుమారు అరడజను మంది సిబ్బంది వున్నారు. వీరి బేటాలు, ప్రయాణ, హోటల్ ఖర్చులు అన్నీ కలుపుకుంటే రోజుకు లక్ష రూపాయల వరకు నిర్మాతకు అదనంగా ఖర్చు అవుతోందట. దీంతో దీనికి స్వస్తి చెప్పేలా నిర్మాతల మండలి ద్వారా ఆమెపై చర్యలు తీసుకోవడానికి నిర్మాతలు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది.
*  బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను ఫైనల్ చేశారు. శ్రియ, అంజలి ఇందులో కథానాయికలుగా నటిస్తారు. వీరు ఈ చిత్రానికి డేట్స్ కేటాయించడం కూడా జరిగింది.
*  ప్రముఖ విమానయాన సంస్థ 'ఎయిర్ డెక్కన్' అధినేత గోపీనాథ్ బయోపిక్ గా సూర్య కథానాయకుడిగా సుధ కొంగర దర్శకత్వంలో 'ఆకాశం నీ హద్దురా' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంచితే, ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేయనున్నామని చిత్ర నిర్మాత గునీత్ మోంగా తెలిపారు.

Nayanatara
Balakrishna
Shriya
Anjali
Surya
  • Loading...

More Telugu News