Sabitha Indrareddy: మరో పదేళ్లు టీఆర్ఎస్‌కు ఢోకా లేదు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Telangana Minister Sabitha said TRS will rule another 10 yrs

  • కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే రక్ష
  • పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు
  • ప్రతిపక్షాల గిమ్మిక్కులను ప్రజలు నమ్మలేదు

రాష్ట్రంలో మరో పదేళ్లు టీఆర్ఎస్ అధికారానికి ఢోకా లేదని తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్‌కు శ్రీరామ రక్ష అని అన్నారు. ఇటీవల జరిగిన మునిసిపల్, సహకార సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మలేదని, టీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని గూడూరు గ్రామ సర్పంచ్ పి.శ్రీలశ్రీహరి, అన్నోజిగూడ సర్పంచ్ కాకి ఇందిర దశరథల నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సబిత సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. పార్టీలకు అతీతంగా తమ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

Sabitha Indrareddy
Telangana
TRS
  • Loading...

More Telugu News