GV Harsha Kumar: పేదల భూములు లాక్కుని అదే పేదలకు పంచుతామంటున్నారు: హర్షకుమార్

Former MP Harsha Kumar lashes out Government decision

  • పిఠాపురంలో దళిత ఐక్యవేదిక సమావేశం
  • పేదలకు భూములు కొని పంచాలని సూచన
  • రిజర్వేషన్ల రద్దుకు మోదీ, జగన్ కుట్రలు పన్నుతున్నారంటూ వ్యాఖ్యలు

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన దళిత ఐక్యవేదిక సమావేశంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పేదల భూములు లాక్కుని అదే పేదలకు పంచుతామంటున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పేదలకు భూములు పంచాలంటే కొని ఇవ్వాలని సూచించారు. రిజర్వేషన్ల రద్దు కోసం మోదీ, జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దళిత సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి కుట్రలను అడ్డుకోవాలని హర్షకుమార్ పిలుపునిచ్చారు. తనపై పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులని ఆయన స్పష్టం చేశారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన జగన్ ఇప్పుడు అవినీతిని అంతం చేస్తాననడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

GV Harsha Kumar
YSRCP
Jagan
Narendra Modi
Reservations
  • Loading...

More Telugu News