Corona Virus: ఇది అతిపెద్ద ఎమర్జెన్సీ, పెద్ద పరీక్ష.. కరోనా వైరస్ వ్యాప్తిపై చైనా అధ్యక్షుడు క్సి జింపింగ్

chinese president xi jinping said coronavirus outbreak is largest public health emergency

  • తొలిసారిగా హెల్త్ ఎమర్జెన్సీగా పేర్కొన్న కమ్యూనిస్టు లీడర్
  • ఈ సంక్షోభం త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం
  • 77 వేలు దాటిపోయిన వైరస్ బాధితుల సంఖ్య
  • చైనా పొరుగు దేశాల్లో పెరుగుతున్న వైరస్ వ్యాప్తి

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో నియంత్రణలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆ దేశ అధ్యక్షుడు క్సి జింపింగ్ కీలక ప్రకటన చేశారు. ఇది చైనాలో అతిపెద్ద హెల్త్ ఎమర్జెన్సీ అని, దానిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా వైరస్ అత్యంత వేగంగా సంక్రమిస్తోందని, ఎక్కువ మందికి విస్తరిస్తోందని.. దానిని నియంత్రించడం కష్టమవుతోందని చెప్పారు.

ఇదొక సంక్షోభం.. పెద్ద పరీక్ష

కరోనా వైరస్ వ్యాప్తిని త్వరలోనే అరికట్టగలమని క్సి జింపింగ్ చెప్పారు. ‘‘ఇది మనకు ఒక సంక్షోభం.. ఇదో పెద్ద పరీక్ష. చైనా ఏర్పాటైన 1949 సంవత్సరం తర్వాత ఇది అతిపెద్ద హెల్త్ ఎమర్జెన్సీ. అనివార్యంగా ఇది మన సమాజంపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే త్వరలోనే పరిస్థితి చక్కబడుతుంది. ఈ పరిస్థితి కొంత కాలమే ఉంటుంది’’ అని చైనా ప్రజలకు భరోసా ఇచ్చారు.

పెరుగుతున్న వైరస్ బాధితులు

చైనాలో కరోనా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య అధికారికంగానే 77 వేలు దాటింది. ఇప్పటివరకు 2,400 మందికిపైగా చనిపోయారు. చైనాలో కొత్తగా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య మెల్లగా తగ్గుతూ వస్తున్నా.. దానికి సమీపంలో ఉన్న జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో పెరుగుతోంది. దీంతో దక్షిణ కొరియాతోపాటు ఇటలీ వంటి పలు దేశాల్లో పరిరక్షణ చర్యలు మొదలుపెట్టారు.

Corona Virus
China
Xi jimping
Health Emergency
  • Loading...

More Telugu News