Gadikota Srikanth Reddy: రామకృష్ణ, నారాయణ వంటి వాళ్లు వచ్చాక కమ్యూనిస్టు పార్టీలంటే గౌరవం పోయింది: శ్రీకాంత్ రెడ్డి

Chief whip Srikanth Reddy fires on CPI Ramakrishna

  • జగన్ ది రివర్స్ పాలన అంటూ వ్యాఖ్యానించిన రామకృష్ణ
  • రామకృష్ణ టీడీపీ కండువా కప్పుకోవాలన్న శ్రీకాంత్ రెడ్డి
  • ముస్లింలు రామకృష్ణ లాంటివాళ్ల మాటలు నమ్మరాదని సూచన

జగన్ ది రివర్స్ పాలన అని, ఎవరి మాట వినకుండా చిన్న మోదీలా తయారవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును చదివే బదులు టీడీపీ కండువా కప్పుకోవాలని అన్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలంటే గౌరవ మర్యాదలు ఉండేవని, కానీ రామకృష్ణ, నారాయణ వంటి వాళ్లు వచ్చాక కమ్యూనిస్టు పార్టీలపైనే గౌరవం పోయిందని వ్యాఖ్యానించారు. ముస్లింలు రామకృష్ణ లాంటివాళ్ల మాటలు నమ్మొద్దని సూచించారు. కాగా, రాయచోటి సీపీఐ నేతలు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ నేతలపై అవహేళనగా మాట్లాడడం తగదని అన్నారు. రామకృష్ణకు శ్రీకాంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు.

Gadikota Srikanth Reddy
CPI Ramakrishna
CPI Narayana
Communist
Chandrababu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News