Doctor Srikanth: ఆ టిక్ టాక్ వీడియోతో మాకు సంబంధం లేదు: హుజూరాబాద్ వైద్యుడు శ్రీకాంత్ స్పష్టీకరణ

Dr Srikanth clarifies over Tik Tok video allegations

  • రోగికి సర్జరీ చేస్తూ డాక్టర్ టిక్ టాక్ వీడియో చేసినట్టు వార్తలు
  • తాము టిక్ టాక్ వీడియో చేయలేదన్న డాక్టర్ శ్రీకాంత్
  • ఆ వీడియో ఆపరేషన్ కు ముందు తీసి ఉంటారని భావిస్తున్నట్టు వెల్లడి

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి శస్త్రచికిత్స చేస్తూ వైద్యులు టిక్ టాక్ వీడియో చేశారంటూ కథనాలు రావడం తెలిసిందే. రోగికి ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్ శ్రీకాంత్, ఆయన బృందం టిక్ టాక్ వీడియో రూపొందించారని, ఆ వీడియో వైరల్ అవుతోందని వార్తలు వచ్చాయి. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలిసింది. అయితే, దీనిపై హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. తాము టిక్ టాక్ వీడియో చేయలేదని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న టిక్ టాక్ వీడియోతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ చేయడానికి ముందు తీసిన వీడియోగా భావిస్తున్నామని తెలిపారు.

Doctor Srikanth
Tik Tok
Video
Huzurabad
Karimnagar District
  • Loading...

More Telugu News