Aamir Khan: చైనాలో కరోనా వైరస్ ప్రబలడంపై హీరో అమీర్ ఖాన్ వ్యాఖ్యలు

Hero Aamir Khan sends video message for his China fans

  • చైనాలో కరోనా వైరస్ మరింత విస్తృతం
  • వేల సంఖ్యలో మరణాలు
  •  వీడియో సందేశం వెలువరించిన అమీర్ ఖాన్

చైనాలో కరోనా వైరస్ మరణమృదంగం మోగిస్తున్న సంగతి తెలిసిందే. వేల సంఖ్యలో మరణాలు చైనాలో పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దీనిపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పందించారు. చైనాలో కరోనా వైరస్ నానాటికీ వ్యాపిస్తుండడం తనను ఎంతో కలచివేసిందని తెలిపారు. చైనాలో వాస్తవ పరిస్థితులను తన స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని, బాధతో గుండెలు బరువెక్కాయని అన్నారు. అయినవారిని కోల్పోయిన చైనా ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని అమీర్ ఖాన్ ఓ వీడియో సందేశం వెలువరించారు.

చైనా త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. వైరస్ సోకకుండా అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని సూచించారు. చైనాలో ప్రస్తుతం ఎంతో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నా, మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని తెలిపారు. అమీర్ ఖాన్ నటించిన చిత్రాలు చైనాలో కూడా విడుదల అవుతాయి. ముఖ్యంగా, దంగల్ చిత్రంతో ఆయనకు చైనాలోనూ భారీగా అభిమానులు ఏర్పడ్డారు.

Aamir Khan
Corona Virus
China
Bollywood
Video
Message
  • Loading...

More Telugu News