JC Diwakar Reddy: జేసీ దివాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్

Chandrababu and Lokesh greets party senior leader JC Diwakar Reddy on his Birthday

  • నేడు జేసీ దివాకర్ రెడ్డి పుట్టినరోజు
  • ఇలాంటి ఉత్తేజంతోనే పనిచేయాలని ఆకాంక్షించిన చంద్రబాబు
  • మరెన్నో ఏళ్లు జీవించేలా ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్టు లోకేశ్ ట్వీట్

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చంద్రబాబు ట్వీట్ చేశారు. మీరు మరెన్నో సంవత్సరాలు ఇదే తరహా శక్తి, ఉత్తేజాలతో పనిచేయాలి, మీకు మంచి ఆయురారోగ్యాలు కలగాలని ఆశిస్తున్నాం అంటూ స్పందించారు. లోకేశ్ కూడా పార్టీ సీనియర్ నేత జేసీ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే జేసీ దివాకర్ రెడ్డి గారు. మరెన్నో ఏళ్లు ఆరోగ్యంతో జీవించేలా మీకు ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు.

JC Diwakar Reddy
Chandrababu
Nara Lokesh
Birthday
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News