Tik Tok: రోగికి సర్జరీ చేస్తూ టిక్ టాక్ వీడియో చేసిన హుజూరాబాద్ వైద్యుడు... స్థానికుల ఆగ్రహం

Doctor makes Tik Tok video while surgery

  • టిక్ టాక్ వీడియోలకు పెరుగుతున్న క్రేజ్
  • ఆపరేషన్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేసిన డాక్టర్ శ్రీకాంత్
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్

టిక్ టాక్ వీడియోలంటే కుర్రకారులో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే సరదా శృతిమించిన ఘటనలు అనేకం జరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు విధి నిర్వహణలో టిక్ టాక్ వీడియోలు చేసినట్టు కథనాలు వచ్చాయి. తాజాగా ఓ వైద్యుడు టిక్ టాక్ వీడియో చేయడం విస్మయం కలిగిస్తోంది. అది కూడా ఆపరేషన్ థియేటర్ లో రోగికి శస్త్రచికిత్స చేస్తూ ఇతర సిబ్బందితో డాక్టర్ టిక్ టాక్ చేయడం కలకలం రేపింది. ఇది జరిగింది ఎక్కడో కాదు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు శ్రీకాంత్ రోగికి ఆపరేషన్ చేస్తూ తన బృందంతో టిక్ టాక్ వీడియో చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tik Tok
Video
Doctor
Srikanth
Huzurabad
  • Loading...

More Telugu News