Bed Bug: ఇప్పుడు ఫ్రాన్స్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది ఏంటో తెలుసా..?

France announces war against Bedbugs

  • ఫ్రాన్స్ లో ప్రబలిన నల్లుల బెడద
  • నల్లులపై యుద్ధం ప్రకటించిన ఫ్రాన్స్ సర్కారు
  • 100 రోజుల కార్యాచరణ ప్రకటన
  • నల్లుల నిర్మూలన కోసం ప్రత్యేక దళం

యూరప్ లో ఉన్న అందమైన దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, అడుగడుగునా ప్రకృతి రమణీయతతో విలసిల్లే ఈ దేశం ఇప్పుడు అనుకోని అతిథితో సతమతమవుతోంది. ఎన్నడూ లేనంతగా నల్లులు ఫ్రాన్స్ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఏకంగా ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చిందంటే నల్లులు ఏ స్థాయిలో విజృంభించాయో అర్థం చేసుకోవచ్చు. ఓ నల్లి మంచంలో చేరిందంటే అది పెట్టే బాధ అంతా ఇంతా కాదు. మంచాలు, కుర్చీలు, సోఫాలు, టేబుళ్లు... ఇలా నల్లి ప్రవేశానికి కాదేదీ అనర్హం అన్నట్టుగా తయారైంది. దాంతో ఫ్రెంచ్ ప్రభుత్వం నల్లులపై యుద్ధం ప్రకటించింది.  

అప్పట్లో రెండో ప్రపంచయుద్ధం తర్వాత డీడీటీ రసాయనం వినియోగంతో నల్లుల బెడద తొలగిపోయింది. ఆ తర్వాత కాలంలో డీడీటీని నిషేధించడంతో నల్లులకు అడ్డంకి తొలగిపోయింది. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. దాంతో నల్లుల నిర్మూలన కోసం 100 రోజుల కార్యాచరణ రూపొందించారు. ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా కేటాయించారు. పేదవారికి నల్లుల నిర్మూలన మందులు ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. అంతేకాదు, నల్లుల అంతం చూసేందుకు ప్రత్యేక దళాన్ని కూడా ఏర్పాటు చేశారు.

Bed Bug
France
Emergency
  • Loading...

More Telugu News