Budda Venkanna: సెర్బియా గోడలపై నీ ఫొటో కూడా అంటించారంట... ఓసారి వెళ్లిరా ఏ2 తాతా!: బుద్ధా వెంకన్న

Budda Venkanna slams YSRCP leader Vijaysai Reddy

  • ఇవీ మీ బ్రతుకులు అంటూ విజయసాయిపై విమర్శలు
  • కోర్టు అనుమతి లేనిదే పక్కదేశం కూడా వెళ్లలేరంటూ వ్యంగ్యం
  • నువ్వు కూడా మాట్లాడే వాడివి అయిపోయావ్ అంటూ ఎద్దేవా

వాన్ పిక్ భూముల కుంభకోణంలో వైసీపీ అగ్రనేతలు ఇరుక్కుపోవడం ఖాయమని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. ఓ మీడియా కథనం తాలూకు క్లిప్పింగ్ ను పోస్టు చేసిన బుద్ధా, అందులో జగన్, వైఎస్, నిమ్మగడ్డల ఫొటోలు ఉండడాన్ని ప్రస్తావిస్తూ, ఏ2 తాతా ఇందులో నీ ఫొటో కూడా ఓ మూల పెడితే ఫొటో సరిగ్గా సెట్ అయ్యేది అంటూ సెటైర్ వేశారు. "నిమ్మగడ్డ ఇచ్చిన సమాచారంతో సెర్బియా గోడలపై నీ ఫొటో కూడా అంటించారంట, ఓసారి సెర్బియా వెళ్లిరా!  కండిషన్ బెయిల్ పై బయట తిరుగుతూ కోర్టు అనుమతి లేనిదే పక్కదేశం కూడా వెళ్లలేరు... ఇవీ మీ బ్రతుకులు! బెయిల్ కి జైల్ కి మధ్య వేలాడే నువ్వు కూడా మాట్లాడే వాడివి అయిపోయావ్" అంటూ ఎద్దేవా చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News