nagababu: విడాకులపై కడుపుబ్బా నవ్వించే వీడియో పోస్ట్ చేసిన నాగబాబు.. జబర్దస్త్, అదిరింది కంటే అత్యద్భుతమంటోన్న నెటిజన్లు

nagababu shares interesting video

  • పిల్లల విడాకులకు పెద్దలు ఎలా కారణమవుతున్నారో తెలుపుతూ వీడియో
  • ప్రసంగంలో నవ్వించిన గరికపాటి నరసింహారావు
  • 28 నిమిషాల హాస్యం గ్యారంటీ అన్న నాగబాబు
  • 'నవ్వకపోతే నేను గ్యారంటీ' అని వ్యాఖ్య

పిల్లల విడాకులకు పెద్దలు ఎలా కారణమవుతున్నారో తెలుపుతూ మహా సహస్రావధాని  గరికపాటి నరసింహారావు చేసిన ప్రసంగం నవ్వులు పూయిస్తోంది. నిత్యజీవితంలో వేదాంతంపై, వ్యక్తిత్వ వికాసంపై గరికపాటి చేసిన ఈ అద్భుత ప్రసంగానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన సినీనటుడు, జనసేన నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'జీవిత సత్యాలని ఖరా ఖండిగా, గొప్పగా, అద్భుతమైన హాస్యంతో చెప్పిన శ్రీ గరికపాటి నరసింహరావు గారు. 28 నిమిషాల నాన్‌స్టాప్‌ హాస్యాన్ని అద్భుతమైన నిజాలతో చెప్పారు. 28 నిమిషాల హాస్యం గ్యారంటీ.. నవ్వకపోతే నేను గ్యారంటీ...' అంటూ నాగబాబు ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. 'జబర్దస్త్.. అదిరింది కన్నా అద్భుతంగా ఈ హాస్యం ఉంది' అంటూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు.

nagababu
Janasena
Twitter
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News