Yanamala: ఇటువంటి చరిత్ర ప్రపంచంలోనే లేదు: వైసీపీపై యనమల విమర్శలు

yanamala criticizes jagan decisions

  • గత టీడీపీ ఐదేళ్ల పాలనపై సిట్‌ ఎందుకు? 
  • జగన్ అవినీతిపై విచారణ న్యాయస్థానాల్లో ముగింపు దశకు చేరింది
  • ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది
  • టీడీపీని అప్రదిష్టపాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనపై సిట్‌ వేసిన చరిత్ర ప్రంపచంలోనే ఎక్కడా లేదని అన్నారు. వైఎస్ జగన్ అవినీతిపై విచారణ న్యాయస్థానాల్లో ముగింపు దశకు చేరిందని, ఈ నేపథ్యంలోనే ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన అన్నారు.

గత టీడీపీ పాలనపై జగన్‌ ప్రభుత్వం అనేక విచారణలు జరిపిందని యనమల చెప్పారు. అయినప్పటికీ ఏ ఆరోపణనూ రుజువు చేయలేక పోయారని అన్నారు. టీడీపీని అప్రదిష్టపాలు చేయడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆయన ధ్వజమెత్తారు.

వైసీపీ ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని తాము కోరామని యనమల చెప్పారు. తాము ఈ డిమాండ్‌పై వెనక్కి తగ్గట్లేదని తెలిపారు. హత్యలకన్నా ఆర్థికనేరాలు ప్రమాదకరమైనవని సుప్రీంకోర్టు పేర్కొందని, 9 నెలల పాలనలో జగన్‌ చర్యల ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడులకు తీవ్ర నష్టం కలిగిందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News