Budda Venkanna: ఏటేటి విజయసాయిరెడ్డి? కేసులు, దర్యాప్తు అంటున్నావు?: బుద్ధా వెంకన్న

budda venkanna fires on vijaya sai reddy

  • కోర్టుకి వెళ్లడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారు?
  • మినహాయింపులు ఎందుకు అడుగుతున్నట్టు?
  • కోర్టుకి వెళ్లి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు కదా

'విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతి పైన, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలి' అని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.

'ఏటేటి విజయసాయిరెడ్డి?  కేసులు, దర్యాప్తు అంటున్నావు? ఏ తప్పు చెయ్యకపోతే ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లడానికి జగన్  గారు ఎందుకు భయపడుతున్నారు? మినహాయింపులు ఎందుకు అడుగుతున్నట్టు?' అని చురకలంటించారు.

'ధైర్యంగా కోర్టుకి వెళ్లి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు కదా.. రస్ ఆల్ ఖైమా కథ తెర పైకి వచ్చాక తేలు కుట్టిన జోడు దొంగల్లా సైలెంట్ గా ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకునే పనిలో బిజీ అయ్యారు ఎందుకు?' అని నిలదీశారు.

'దేశద్రోహం గురించి జగన్  గారు, మీరు మాట్లాడుతుంటే వినడానికి చాలా బాలేదు సాయి రెడ్డి. ఫెమా, ఫెరా చట్టాలను ఉల్లంఘించి సూట్ కేస్ కంపెనీలతో ప్రజాధనాన్ని దేశాలు మళ్లించి దేశ ద్రోహం కేసులు నమోదైన వ్యక్తులు జగన్, విజయసాయిరెడ్డి' అని విమర్శించారు.

'జి.ఎన్ రావు కమిటీతో విశాఖ రాజధానిగా పనికి రాదు అని రాయించావు. ఇప్పుడు సాక్షి 2 లో రాజధాని ఏర్పాటుకి నేవి అభ్యంతరం అని వార్త రాయించి, మరక మాకు అంటించాలి అని గిమ్మిక్కులు ఎందుకు?' అని ప్రశ్నించారు.

'విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవి తీవ్ర అభ్యంతరం తెలిపింది అని వార్త రాసిన పత్రిక మీ దొడ్డి లో కట్టేసుకున్న పేపర్. చెత్త బతుకులు మీవి' అని విమర్శలు గుప్పించారు.


Budda Venkanna
Telugudesam
Vijay Sai Reddy
YSRCP
  • Error fetching data: Network response was not ok

More Telugu News