Kruti karbanda: తన లగేజ్ పోగొట్టారని నటి కృతి కర్బందా తిట్లు... క్షమాపణలు చెప్పిన ఎయిర్ ఇండియా!

Actress Kruti Karbanda Luggage Miss in Air India Flight

  • ఇటీవల ముంబై నుంచి గోవాకు ప్రయాణం
  • లగేజీని చేర్చలేకపోయిన విమాన సిబ్బంది
  • సిబ్బంది అమర్యాదకరంగా ప్రవర్తించారని కృతి ఆరోపణ

బాలీవుడ్ హీరోయిన్ కృతీ కర్బందా, ఇటీవల ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో ప్రయాణించగా, ఆమె లగేజ్ మాయమైంది. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కృతి, ఎయిర్ ఇండియాను టార్గెట్ చేసుకుని పలు ట్వీట్లు పెట్టింది. మరోసారి తన లగేజీని మాయం చేసినందుకు ధన్యవాదాలని సెటైర్లు వేసింది. ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలో సిబ్బందికి నేర్పాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఉద్యోగులు కనీస మర్యాదను కూడా చూపించడం లేదని మండిపడింది.

ఇక కృతి చేసిన ట్వీట్లపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ, జరిగిన ఘటనపై క్షమాపణలు కోరింది. తాము సిబ్బందితో చర్చిస్తున్నామని, లగేజీ ట్యాగ్ నంబర్ తమకు తెలియజేయాలని కోరింది. దీనిపై స్పందించిన కృతి, క్షమాపణలు అంగీకరించడం ఇష్టమేనని, అయితే, లగేజ్ గురించిన సమాచారం ఇంకా అందలేదని, తన బ్యాగులు ముంబైలో ఉన్నాయో, గోవాలో ఉన్నాయో కూడా ఇప్పటివరకూ కనిపెట్టలేకపోయారని ఆరోపించింది.

Kruti karbanda
Air India
Flight
Luggage
Miss
  • Loading...

More Telugu News