Nuzivedu: నూజివీడు ఐఐఐటీ అమ్మాయిల హాస్టల్ లో రాత్రంతా గడిపిన అబ్బాయి... ఇద్దరూ సస్పెండ్!

Boy and Girl Suspend from Nuzivedu IIIT

  • ఇద్దరి తల్లిదండ్రులనూ పిలిపించిన వర్శిటీ యాజమాన్యం
  • వారితోనే ఇంటికి పంపించి వేశామని వెల్లడి
  • భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు

నూజివీడు ఐఐఐటీలో భాగంగా ఉన్న అమ్మాయిల హాస్టల్ లో ఒక రాత్రంతా గడిపిన అబ్బాయి ఉదంతం తీవ్ర కలకలం రేపగా, ఇద్దరి తల్లిదండ్రులనూ పిలిపించిన వర్శిటీ యాజమాన్యం, వారిని కళాశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించిన వర్శిటీ రిజిస్ట్రార్, వారిని తల్లిదండ్రులకు అప్పగించి, కాలేజీ నుంచి పంపించి వేశారు. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని, భవిష్యత్తులో ఇటువంటివి జరుగకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కళాశాల ఉన్నతాధికారులు తెలిపారు. లేడీస్ హాస్టల్ భద్రతను పెంచుతున్నామని వార్డెన్, సెక్యూరిటీ గార్డులపై విచారణ జరుగుతోందని తెలిపారు. కాగా, ఈ నెల 16వ తేదీ రాత్రి, కిటికీ గుండా అమ్మాయి గదిలోకి ప్రవేశించిన అబ్బాయి, రాత్రంతా ఆమెతోనే గడపగా, ఉదయం పూట అతన్ని గమనించిన మరో అమ్మాయి, అతన్ని పట్టించిన సంగతి తెలిసిందే. 

Nuzivedu
IIIT
Girl
Boy
One Night
Ladies Hostel
  • Loading...

More Telugu News