Rashmika Mandanna: హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుంటున్నాను: రష్మికా మందన్న

Rashmika wants a house in Hyderabad

  • మరో రెండు సినిమాల తరువాత ఇల్లు కొంటాను
  • బురఖా వేసుకుని చార్మినార్ చూసి రావాలని వుంది
  • నన్ను తెలుగమ్మాయిననే అనుకుంటున్నారు
  • మీడియాతో శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక

కన్నడ భామే అయినా, తెలుగులో 'ఛలో'తో అడుగుపెట్టి, టాప్ హీరోల పక్కన చాన్స్ కొట్టేస్తూ, సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగిన రష్మికా మందన్న, హైదరాబాద్ లో ఇల్లు కొనాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. బంజారాహిల్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రష్మిక, కాసేపు మీడియాతో మాట్లాడింది. తెలుగులో ఇంకో రెండు సినిమాల తరువాత ఇల్లు కొనుక్కుంటానని, తనకు ఇక్కడే ఉండి పోవాలని అనిపిస్తోందని అంటోందీ శాండల్ వుడ్ బ్యూటీ.

తనకు కోపం వస్తే షాపింగ్ కు వెళ్లిపోతానని, సంప్రదాయ దుస్తులనే అధికంగా ఇష్టపడతానని చెప్పుకొచ్చింది రష్మిక. సమయం ఖాళీగా ఉంటే టీవీ చూస్తూనో, పుస్తకాలు చదువుతూనో ఉండి పోతానని చెప్పింది. తనను అందరూ తెలుగు అమ్మాయిననే అనుకుంటున్నారని, ఈ మధ్య తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నానని రష్మిక తెలిపింది. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకుంటే, ఫిట్ నెస్ కు సంబంధించిన వ్యాపారం చేసుండేదాన్నని వెల్లడించింది.

తనకు చార్మినార్ చూడాలని ఉందని, ఏదో ఒక రోజు రాత్రి పూట బురఖా వేసుకుని అయినా అక్కడికి వెళ్లి వస్తానని, గోల్కొండ కోటను కూడా చూడాల్సి వుందని రష్మిక చెప్పింది. మూడేళ్ల క్రితం తాను హైదరాబాద్ కు వచ్చినప్పుడు బిర్యానీ తెగ తినేదాన్నని, కానీ ఇప్పుడు మాత్రం నాన్ వెజ్ తినడం మానేశానని తెలిపింది.

Rashmika Mandanna
Media
Hyderabad
Own House
  • Loading...

More Telugu News