Vinay Sharma: ఎప్పుడైనా ఉరి తీయవచ్చు... వినయ్ శర్మ బాగున్నాడన్న తీహార్ జైలు అధికారులు!

Nirbhaya Convict Vinay Sharma is perfectly alright

  • మార్చి3న శిక్ష అమలుకు డెత్ వారెంట్
  • తప్పించుకునేందుకు చూస్తున్న వినయ్ శర్మ
  • తరచూ వైద్యులు పరీక్షిస్తున్నారన్న తీహార్ అధికారులు

నిర్భయ కేసులో ఉరి శిక్ష అమలు కావాల్సిన వినయ్ శర్మ, ఆరోగ్య పరంగా బాగానే ఉన్నాడని, అతన్ని ఏ క్షణమైనా ఉరి తీయవచ్చని తీహార్ జైలు అధికారులు వ్యాఖ్యానించారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకే అతను తలను గోడకేసి బాదుకున్నాడని, మానసిక వ్యాధితో బాధపడుతూ ఉన్నట్టు నటిస్తున్నాడని వెల్లడించారు. ఇదే విషయాన్ని తాము పటియాలా కోర్టు న్యాయమూర్తి ధర్మేందర్‌ కు వెల్లడించామన్నారు. ఎలాంటి మానసిక రుగ్మతలతో బాధపడట్లేదని, జైలు డాక్టర్లు తరచూ పరీక్షలు చేస్తూనే ఉన్నారని అన్నారు. కాగా, నిర్భయ కేసులో మార్చి 3న నలుగురు నిందితులకూ శిక్షను అమలు చేయాలని డెత్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే.

Vinay Sharma
Nirbhaya
Death Warrent
Tihar
Jail
  • Loading...

More Telugu News