Vidya: బీజేపీలో చేరిన వీరప్పన్ కుమార్తె విద్య

Veerappan Daughter Vidya Joined BJP

  • మూడు రాష్ట్రాల పోలీసులను గడగడలాడించిన వీరప్పన్
  • కృష్ణగిరిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీలో చేరిన విద్య
  • ప్రజా సేవ చేసేందుకేనని వెల్లడి

సత్యమంగళం అడవులు కేంద్రంగా ఒకప్పుడు మూడు రాష్ట్రాల పోలీసులు, అధికారులను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, వీరప్పన్‌ కుమార్తె విద్య బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆమె తన అనుచరులతో కలిసి, తమిళనాడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రన్, పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి మురళీధరన్, మాజీ కేంద్ర మంత్రి పొన్‌ రాధాక్రిష్ణన్‌ తదితరుల సమక్షంలో పాల్టీలో చేరారు.

క్రిష్ణగిరిలోని ఓ ప్రైవేట్‌ కళ్యాణ మంటపంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యతో పాటు ఆమె మిత్రులు, అనుచరులు సుమారు 2 వేల మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా విద్య మాట్లాడుతూ, ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను బీజేపీలో చేరినట్టు వెల్లడించారు.

Vidya
Veerappan
BJP
Tamilnadu
  • Loading...

More Telugu News