Pushpasreevani Pamula: ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు

  • పుష్పశ్రీవాణిపై గత ఏడాది జూన్ లో అసభ్యకర పోస్ట్ లు
  • నిందితుడు పేరు వెంకటేశ్వర్లు..నెల్లూరు జిల్లా వాసిగా గుర్తింపు
  • నిందితుడిని బెంగళూరులో అరెస్ట్ చేశామన్న ఏఎస్పీ

ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై అసభ్యకర పోస్ట్ లు పెట్టిన వ్యక్తిని  పోలీసులు అరెస్టు చేశారు. పార్వతీపురం ఏఎస్పీ సుమిత్ గరుడ ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నిందితుడు వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా వాసిగా కావలి పోలీసులు గుర్తించారని,  ఏ రాజకీయపార్టీతోనూ అతనికి సంబంధం లేదని తమ విచారణలో తేలినట్టు చెప్పారు.

నిందితుడు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి ఓ బృందాన్ని అక్కడికి పంపి అతన్ని అరెస్టు చేసినట్టు వివరించారు. కాగా, గత ఏడాది జూన్ లో ‘ఫేస్ బుక్’ వేదికగా పుష్పశ్రీవాణిపై అసభ్యకర పోస్ట్ లు చేశాడు. ఈ విషయమై విజయనగరం పోలీసులకు ఆమె గత అక్టోబరులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు.  

Pushpasreevani Pamula
Ap Deputy sri vani
Accused
Arrest
  • Loading...

More Telugu News