Asaduddin Owaisi: ఒవైసీ సభలో 'రచ్చ' చేసిన అమ్మాయి అమూల్యను చంపితే రూ.10 లక్షలు ఇస్తా: శ్రీరామ్ సేన సభ్యుడు

kill amulya and get prize money say sriram sena member

  • శ్రీరామసేన సభ్యుడు సంజీవ్ మరాడి వ్యాఖ్యలు 
  • దేశ వ్యతిరేక చర్యలు కేన్సర్ లా వ్యాపిస్తున్నాయని ఆగ్రహం
  • దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న కశ్మీరీ విద్యార్థులపై కూడా రివార్డు
  • నాలుకలు కోసేస్తే 3 లక్షల రివార్డు ఇస్తానని శ్రీ రామసేన ప్రకటన

పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా బెంగళూరులో నిర్వహించిన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ కార్యక్రమంలో అమూల్య అనే అమ్మాయి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసి రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమెపై దేశద్రోహం కేసు నమోదవడంతో,14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి ఆమెను పంపించారు.

ఇక ఆమెను చంపిన వారికి రూ.10 లక్షలు బహుమతిగా ఇస్తానంటూ శ్రీరామసేన ప్రకటించింది. శ్రీరామసేన సభ్యుడు సంజీవ్ మరాడి బళ్లారిలో మాట్లాడుతూ... దేశ వ్యతిరేక చర్యలు కేన్సర్ లా వ్యాపిస్తున్నాయన్నారు. అయితే, ఆయన తమ సేన సభ్యుడు కాదని శ్రీరామ్‌ సేన అంటోంది. కాగా, దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కశ్మీరీ విద్యార్థుల నాలుకలు కోసేస్తే  రూ.3 లక్షల రివార్డు ఇస్తానని  శ్రీ రామసేన నాయకుడు ఒకరు ప్రకటించారు.

Asaduddin Owaisi
Bengaluru
  • Loading...

More Telugu News