Mekathoti Sucharitha: టీడీపీని కాపాడుకోవడానికి ఆ పార్టీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు: మంత్రి సుచరిత

Ap Home minister comments on TDP

  • టీడీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి
  • వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం తగదు
  • రాజధాని తరలింపు అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే

తెలుగుదేశం పార్టీ నేతలపై ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత మండిపడ్డారు. ఏపీలో టీడీపీ పాలనలో భారీ అవినీతికి పాల్పడిందని, టీడీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయని విమర్శించారు. టీడీపీ నేతలు వాళ్ల పార్టీని కాపాడుకోవడానికి వైసీపీపై, తమ నాయకులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

మందడంలో మహిళలు స్నానం చేస్తుంటే డ్రోన్ల ద్వారా చిత్రీకరించారని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారంతో లబ్ధి పొందాలని టీడీపీ నేతలు చూడటం సిగ్గుమాలిన చర్య అని దుమ్మెత్తి పోశారు. రాజధాని రైతులు శాంతియుతంగా ఉద్యమిస్తే ఎటువంటి అభ్యంతరం లేదు కానీ, ఈ ఉద్యమాల్లో బయట వ్యక్తులు చొరబడి పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజధాని తరలింపు అభివృద్ధి వికేంద్రీకరణ కోసమేనని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోమారు స్పష్టం చేశారు.

 


Mekathoti Sucharitha
YSRCP
Telugudesam
Amaravati
  • Loading...

More Telugu News