Nirbhaya: నిర్భయ దోషులు ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు వేస్తోన్న ఎత్తుగడలివి: నిర్భయ తల్లి

Asha Devi says It was a tactic to delay the execution

  • న్యాయస్థానాన్ని దోషులు తప్పుదోవ పట్టిస్తున్నారు
  • దోషుల ముందున్న న్యాయపర అవకాశాలు పూర్తి 
  • మార్చి 3న వారికి ఉరి శిక్ష పడుతుందని నమ్ముతున్నా 

దేశ రాజధాని ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు పవన్‌ గుప్తా, వినయ్ కుమార్‌ శర్మ, అక్షయ్ కుమార్‌, ముఖేష్‌ కుమార్‌ సింగ్‌లకు  మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరి తీయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల వినయ్ తలను గోడకు కొట్టుకున్న నేపథ్యంలో ఉరి అమలుపై మరోసారి సందిగ్ధత ఏర్పడింది. అయితే, తనకు వైద్య చికిత్స అందించాలంటూ వినయ్‌ కుమార్‌ వేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని పటియాలా కోర్టు కొట్టి వేసింది.

ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడారు.. 'ఉరి శిక్ష అమలును ఆలస్యం చేయడానికి దోషులు వేస్తోన్న ఎత్తుగడలు ఇవి. న్యాయస్థానాన్ని దోషులు తప్పుదోవ పట్టిస్తున్నారు. దోషులు ముందున్న అన్ని న్యాయపర అవకాశాలు ముగిశాయి. మార్చి 3న వారికి ఉరి శిక్ష పడుతుందని నేను నమ్ముతున్నాను' అని చెప్పారు. 

Nirbhaya
New Delhi
Hyderabad
  • Loading...

More Telugu News