Srivas: సినీ దర్శకుడు శ్రీవాస్ కు మాతృవియోగం

Director Srivas mother passes away

  • శ్రీవాస్ తల్లి అమ్మాజీ కన్నుమూత
  • అమ్మాజీ వయసు 68 సంవత్సరాలు
  • పురుషోత్తపట్నంలో జరగనున్న అంత్యక్రియలు

టాలీవుడ్ దర్శకుడు శ్రీవాస్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి అమ్మాజీ ఈరోజు తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. ఈ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆమె కన్నుమూశారు. ఆమె వయసు 68 సంవత్సరాలు. ఆమె అంత్యక్రియలు తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో జరగనున్నాయి. అమ్మాజీ దంపతులకు శ్రీవాస్ తో పాటు మరో ఇద్దరు సంతానం ఉన్నారు. మరోవైపు, నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు డీవీవీ కల్యాణ్ ను హీరోగా పరిచయం చేయబోతున్న సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించబోతున్నాడు.

Srivas
Tollywood
Director
Mother
Passed Away
  • Loading...

More Telugu News