Madhu: మూడు రాజధానుల ప్రకటనతో అనేక వ్యాపారాలు హైదరాబాద్​ కు తరలిపోయాయి: సీపీఎం నేత మధు

AP CPM leader Madhu comments on 3 capitals

  • అమరావతి తరలింపు అంశం అన్ని రంగాల అభివృద్ధిపై పడింది
  • రాజధాని తరలింపు అంశాన్ని విరమించుకోవాలి
  • చేయని నేరాలకు రైతులపై కేసులు నమోదు చేస్తున్నారు

మూడు రాజధానుల ప్రకటనతో అనేక వ్యాపారాలు హైదరాబాద్ కు తరలిపోయాయని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణాయపాలెంలో రైతుల దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, అమరావతి తరలింపు అంశం అన్ని రంగాల అభివృద్ధిపైనా పడిందని, రాజధాని తరలింపు అంశాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. చేయని నేరాలకు రైతులపై కేసులు నమోదు చేయడం తగదని ప్రభుత్వానికి హితవు పలికారు.

ప్రభుత్వం తీరుకు నిరసనగా అమరావతి గ్రామాల్లో ఈరోజు బంద్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ, ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న రైతులపై ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్ రాష్ట్రంలో సమస్యలు సృష్టించి ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని విమర్శించారు.

Madhu
cpm leader
Andhra Pradesh
Amaravati
  • Loading...

More Telugu News