Nirbhaya: నిర్భయ దోషులకు చివరి లేఖ రాసిన తీహార్ జైలు అధికారులు

Tihar Jail Officials last letter to Nirbhaya Convicts

  • కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతిస్తామంటూ లేఖ
  • కుటుంబ సభ్యులను కలుస్తామని చెప్పిన అక్షయ్, వినయ్
  • మార్చి 3న దోషులకు ఉరిశిక్ష అమలు

మార్చి 3న ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్రయల్ కోర్టు డెత్ వారెంట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో, నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారులు చివరి లేఖను రాశారు. కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతిస్తామంటూ లేఖలో అధికారులు పేర్కొన్నారు. అయితే, దోషుల్లో ఇద్దరైన అక్షయ్, వినయ్ మాత్రమే తమ కుటుంబ సభ్యులను కలుస్తామని అధికారులకు చెప్పారట. ముఖేశ్, పవన్ మాత్రం ఫిబ్రవరి 1వ తేదీకి ముందే తాము కుటుంబ సభ్యులను కలిశామని జైలు అధికారులకు తెలిపారు. మరోవైపు, వినయ్ తన తలను జైల్లోని గోడకు కొట్టుకోవడంతో, జైలు అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Nirbhaya
Convicts
Tihar Jial
Letter
  • Loading...

More Telugu News