Taapsee: మేమిద్దరం కొంచెం అటూఇటుగా ఒకేలా ఉంటాం: మిథాలీరాజ్

Mithali Raj Comments on Sabaash Mithu Poster

  • 'శభాష్ మిథు' పేరుతో తెరకెక్కుతున్న మిథాలీ రాజ్ జీవిత చరిత్ర
  • ఫస్ట్ లుక్ ను షేర్ చేసిన తాప్సీ
  • అచ్చం తనలానే ఉందన్న మిథాలీ

టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ జీవిత చరిత్ర అధారంగా 'శభాష్ మిథు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మిథాలి పాత్రను తాప్సీ పోషిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ ను తాప్సీ తన ఇన్స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై మిథాలీ స్పందిస్తూ, తామిద్దరం కొంచెం అటూఇటుగా ఒకేలా ఉంటామని తెలిపింది. తాను ఎలా ఉన్నానో తాప్పీ కూడా అలాగే ఉందని... తాను పెట్టుకున్న హ్యాట్ లాంటిదే ఆమె కూడా పెట్టుకుందని చెప్పింది. తాను ఆడుతున్నప్పుడు తన కురులు ముందుకు పడుతుంటాయని.. పోస్టర్ లో కూడా తాప్పీ ముఖంపై అలాగే పడ్డాయని తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

Taapsee
Mithali Raj
Shabaas Mithu Movie
First Look
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News