KCR: ట్రంప్ తో విందు.. కేసీఆర్ కు రాష్ట్రపతి ఆహ్వానం!

KCR gets invitation for dinner with Donald Trump

  • రెండు రోజుల భారత పర్యటనకు విచ్చేస్తున్న ట్రంప్
  • 25న ట్రంప్ కు గౌరవ విందును ఇవ్వనున్న రాష్ట్రపతి
  • కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటనకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటన సందర్భంగా ఈనెల 25న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గౌరవ విందును ఇవ్వనున్నారు. ఈ విందు కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాష్ట్రపతి ఆహ్వానించారు. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్టు సమాచారం. ఇంకా బీహార్, ఒడిశా, కర్ణాటక, హర్యాణా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది.

KCR
TRS
Ram Nath Kovind
Donald Trump
Dinner Meeting
  • Loading...

More Telugu News