Hrithik Roshan: మాజీ భార్య సుజానేఖాన్‌తో కలిసి శివుడికి పూజలు చేసిన బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్

Hritik Roshan ex wife sujane khan prayers to lord shiva with Hritik

  • 2000లో పెళ్లాడి 2014లో విడిపోయిన హృతిక్-సుజానే జంట
  • తాజాగా మళ్లీ చెట్టపట్టాలు
  • హృతిక్‌తో కలిసి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సుజానే

విభేదాలతో విడాకులు తీసుకుని దూరమైన బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సుజానేఖాన్‌ శివరాత్రిని పురస్కరించుకుని నీలకంఠుడికి పూజ చేయడం సంచలనమైంది. కుమారులు హ్రీహాన్, హ్రీదాన్‌లతో కలిసి ముంబైలోని పన్వేల్ ప్రాంతంలో ఉన్న శివాలయానికి వచ్చిన సుజానేఖాన్.. మాజీ భర్త హృతిక్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న హృతిక్, సుజానేలు 2014లో మనస్పర్థల కారణంగా విడిపోయారు. తాజాగా వీరిద్దరూ మళ్లీ కనిపిస్తుండడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇటీవల ఇద్దరూ కలిసి మంచుకొండల్లో విహరించిన ఫొటోలు నెట్‌లో హల్‌చల్ చేశాయి.

Hrithik Roshan
Sivaratri
Sujane khan
Bollywood
  • Loading...

More Telugu News