Priyanka Chopra: ఫాలోవర్ల విషయంలో... కోహ్లీకి చేరువలో నిలిచిన ప్రియాంక

Priyanka Chopra makes it 50 million Instagram followers as Kohli leads the way

  • ఇన్ స్టాగ్రామ్ లో కోహ్లీ ఫాలోవర్స్ 50.3 మిలియన్లు
  • 50 మిలియన్ల మైలురాయి చేరుకున్న ప్రియాంక
  • మూడో స్థానంలో దీపిక పదుకొనే

ఇన్ స్టాగ్రామ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అనుసరించే వారి సంఖ్య 50.3 మిలియన్లు. భారత్ లో ఇన్ స్టా ఫాలోవర్ల విషయంలో కోహ్లీనే నెంబర్ వన్. అయితే అందాలభామ ప్రియాంక చోప్రా కూడా హాఫ్ సెంచరీ మైలురాయి అందుకుంది. ప్రియాంక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 50 మిలియన్లకు చేరింది.

దేశంలో కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన సెలబ్రిటీ ప్రియాంకనే. వీరిద్దరి తర్వాత స్థానంలో బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపిక పదుకొనే 44.2 మిలియన్ల మంది ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉంది. కాగా, ప్రియాంక చోప్రా బాలీవుడ్ చిత్రాల్లోనే కాకుండా హాలీవుడ్ సినిమాల్లోనూ, అమెరికా వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. నటగాయకుడు నిక్ జోనాస్ ను వివాహమాడిన తర్వాత ప్రియాంక అభిమానగణం మరింత పెరిగింది.

Priyanka Chopra
Virat Kohli
Instagram
Followers
  • Loading...

More Telugu News