pattabhi: ఆ సవాల్​ కు స్పందించి వైసీపీ నుంచి ఒక్క మగాడూ బయటకు రావట్లేదు!: టీడీపీ నేత పట్టాభి

TDP Leader Pattabhi comments on Ysrcp

  • లోకేశ్ సవాల్ కు వైసీపీ వాళ్లు స్పందించరే?
  • అవినీతి సంపాదనతో స్థాపించిన పత్రిక ’సాక్షి‘
  • జగన్ తన ఆస్తుల వివరాలు ప్రకటించాలి

వైసీపీ, సాక్షి పత్రికపై టీడీపీ నేత పట్టాభి విరుచుకుపడ్డారు. ఈరోజ ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కుటుంబం ప్రకటించిన ఆస్తుల కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా వైసీపీ నేతలు చెప్పిన ట్రస్ట్ కు రాసిస్తానని టీడీపీ నేత నారా లోకేశ్ సవాల్ విసిరినా దానికి వైసీపీ నుంచి ఒక్కమగాడు కూడా స్పందించి బయటకు రాలేదని విమర్శించారు. జగన్ కు దమ్ముంటే తన ఆస్తుల వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అవినీతి సంపాదన నుంచే సాక్షి పత్రిక పుట్టింది కనుక తమ నేతలపై తప్పుడు రాతలు రాస్తోందని నిప్పులు చెరిగారు.

pattabhi
Telugudesam
YSRCP
sakhsi
press
Nara Lokesh
  • Loading...

More Telugu News