AP PCC: ఏపీ పీసీసీ ఆఫీస్ బేరర్ల నియామకం... కిరణ్ కుమార్ రెడ్డికి కీలక కమిటీల్లో స్థానం

AICC appoints office bearers in Andhra Pradesh PCC

  • ఇటీవలే పీసీసీ అధ్యక్షుడ్ని నియమించిన ఏఐసీసీ
  • తాజాగా ప్రధాన కార్యదర్శుల నియామకం
  • కీలక కమిటీల ప్రకటన
  • సమన్వయ, రాజకీయ కమిటీల్లో కిరణ్ కుమార్ రెడ్డికి స్థానం కల్పించిన ఏఐసీసీ

ఇటీవలే ఏపీ పీసీసీకి అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించిన కాంగ్రెస్ అధిష్ఠానం తాజాగా ఆఫీసు బేరర్లను నియమించింది. ఏపీ పీసీసీకి తాజాగా 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులను నియమిస్తున్నట్టు ఏఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు, 29 మందితో సమన్వయ కమిటీ, 12 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీలు ఏర్పాటు చేసింది. కాగా, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా పీసీసీ చీఫ్ శైలజానాథ్ వ్యవహరిస్తారు. సమన్వయ కమిటీ చైర్మన్ గా ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి ఊమెన్ చాందీ వ్యవహరిస్తారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ రఘువీరా రెడ్డిలకు ఈ రెండు కమిటీల్లో స్థానం కల్పించారు.

AP PCC
Congress
Kiran Kumar Reddy
AICC
  • Loading...

More Telugu News