Cherukuvada Sriranganadha Raju: వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ నివాసానికి వెళ్లిన మంత్రి శ్రీరంగనాథరాజు

  • రజనీ మరిది గోపినాథ్‌ కారుపై నిన్న గుర్తుతెలియని వ్యక్తుల దాడి
  • ఈ ఘటన నేపథ్యంలో రజనీ నివాసానికి వెళ్లిన మంత్రి
  • రజనీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మరిది గోపినాథ్‌ ప్రయాణిస్తున్న కారుపై నిన్న అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో రజనీ నివాసానికి మంత్రి శ్రీరంగనాథరాజు ఈరోజు వెళ్లారు. నిన్నటి ఘటన చాలా బాధాకరమని, టీడీపీ శ్రేణులు ఇలాంటి ఘటనలకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదని, కఠిన చర్యలు తీసుకుంటుందని, రజనీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం.

Cherukuvada Sriranganadha Raju
YSRCP
Vidadala Rajani
  • Loading...

More Telugu News