Ross Taylor: ఇన్ని బాటిళ్లు నేనొక్కడినే తాగలేను... సాయం కావాలి: రాస్ టేలర్

Ross Taylor says need help to drink all these bottles

  • న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ అరుదైన రికార్డు
  • అన్ని ఫార్మాట్లలో వందేసి మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ గా ఘనత
  • 100 వైన్ బాటిళ్లు కానుకగా ఇచ్చిన సహచరులు

న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో వందేసి మ్యాచ్ లు ఆడిన ఏకైక ఆటగాడిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించాడు. ఇప్పటికే 100కి పైగా వన్డేలు, 100 టి20లు ఆడిన రాస్ టేలర్ తాజాగా 100వ టెస్టు ఆడుతున్నాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టుతో టేలర్ మూడు ఫార్మాట్లలోనూ వంద మ్యాచ్ ల క్రికెటర్ గా అవతరించాడు.

 ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు సహచరులు టేలర్ కు అద్భుతమైన బహుమతి ఇచ్చారు. మాజీ ఆటగాడు ఇయాన్ స్మిత్ చేతులమీదుగా 100 వైన్ బాటిళ్లను బహూకరించారు. దీనిపై రాస్ టేలర్ స్పందించాడు. ఇన్ని బాటిళ్లు ఇవ్వడం కాస్త అతిశయంగా అనిపిస్తోందని అన్నాడు. కానీ, ఈ బాటిళ్లన్నీ తాను తాగలేనని, ఎవరైనా సాయం చేయాలని చమత్కరించాడు.

Ross Taylor
100 Matches
100 Wine Bottles
Team New Zealand
  • Error fetching data: Network response was not ok

More Telugu News