Mohan Babu: ఓ నటుడిగా మహాశివరాత్రి నాడు ఇక్కడికి రావడం ఇదే తొలిసారి: మోహన్​ బాబు

Artist Mohan Babu visits SrikalaHasti

  • నేను చదువుకునే రోజుల్లో మహాశివరాత్రికి  శ్రీకాళహస్తి  వచ్చాను
  • నటుడిగా ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చాను
  • ‘ఈశ్వరేచ్ఛ‘  ఉండటం వల్లే ఈరోజున ఇక్కడికి రాగలిగా

మహా శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రాన్ని టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు సందర్శించారు. కాళహస్తీశ్వరుడి దర్శనం అనంతరం, తనను పలకరించిన మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చదువుకునే రోజుల్లో మహాశివరాత్రికి శ్రీకాళహస్తికి వచ్చాననీ, కానీ, నటుడు అయిన తర్వాత ఈ పర్వదినం రోజున ఇక్కడికి రావడం ఇదే తొలిసారని చెప్పారు.

‘ఈశ్వరేచ్ఛ‘ అంటాము, అది ఉండటం వల్లే ఈరోజున ఇక్కడికి రాగలిగానని, పార్వతీపరమేశ్వరులే తనను ఇక్కడికి  పిలిపించారంటూ ఎంతో భక్తిభావంతో మోహన్ బాబు చెప్పారు. తమ కులదైవాలు నాగ దేవత, సుబ్రహ్మణ్యస్వామి, వెంకటేశ్వరస్వామి కానీ, తాను, తన తమ్ముళ్లు, చెల్లెలు పరమేశ్వరుడి ఆశీస్సులతో తమ తల్లిదండ్రులకు పుట్టామని అన్నారు.

ఈ సందర్భంగా రాజకీయాల గురించి విలేకరులు ప్రశ్నించగా మోహన్ బాబు స్పందిస్తూ,
‘ఇక్కడికి మనం వచ్చింది శివుడిని చూడటానికా? రాజకీయం మాట్లాడటానికా?’ అని తిరిగి ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన కుమారుడు మంచు విష్ణు నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ’కన్నప్ప’ గురించి ఆయన ప్రస్తావిస్తూ.. దాదాపు అరవై కోట్ల రూపాయల ఖర్చుతో ఈ చిత్రాన్ని తీస్తున్నారని అన్నారు.

Mohan Babu
Artist
Srikalahasti
Maha SivaRatri
  • Loading...

More Telugu News