Krack: కిర్రాక్ పుట్టించేలా రవితేజ 'క్రాక్' టీజర్ వచ్చేసింది!

Raviteja starred Krack teaser released

  • రవితేజ పోలీసాఫీసర్ గా తెరకెక్కుతున్న 'క్రాక్'
  • మహాశివరాత్రి కానుకగా టీజర్ రిలీజ్
  • మే 8న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం

మాస్ మహారాజా రవితేజ నటించిన 'క్రాక్' చిత్రం టీజర్ రిలీజైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ ను మహాశివరాత్రి కానుకగా తీసుకువచ్చారు. 'క్రాక్' చిత్రం వేసవిలో మే 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రవితేజ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకుడు. బి.మధు నిర్మాత. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 'క్రాక్' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Krack
Raviteja
Teaser
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News