AR Rahman: ఏఆర్ రెహమాన్ బహుముఖ ప్రజ్ఞ!

AR Rahman as writer and producer for 99 Songs movie

  • రొమాంటిక్ మ్యూజికల్ గా తెరకెక్కుతున్న 99 సాంగ్స్
  • 99 సాంగ్స్ చిత్రానికి నిర్మాతగా రెహమాన్
  • ఈ సినిమాకు రచయితగానూ వ్యవహరిస్తున్న సంగీత దిగ్గజం

భారత సంగీత దిగ్గజం, ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ కొత్త అవతారం ఎత్తుతున్నాడు. ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా ఉన్నతశిఖరాలు అధిరోహించిన రెహమాన్ తాజాగా నిర్మాతగా, రచయితగా పరిచయం కాబోతున్నారు. 99 సాంగ్స్ అనే చిత్రానికి రెహమాన్ సంగీత దర్శకుడిగానే కాదు రచయిత, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇహాన్ భట్, ఎడిల్సే వర్గాస్ జంటగా నటిస్తున్న ఈ సంగీతభరిత ప్రేమకథా చిత్రానికి విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకుడు. అంబానీకి చెందిన జియో స్టూడియోతో కలిసి రెహామన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడమే కాదు రచయితగానూ కలం కదిపారు.

దీనిపై రెహమాన్ మాట్లాడుతూ, కొత్త బాధ్యతల్లో పనిచేయడం కొంచెం కష్టంగానే ఉందని తెలిపారు. ఇంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు అనుభవజ్ఞుడైన దర్శకుడు, నిర్మాత, పాటల రచయితతో ఆలోచనలు పంచుకునేవాడ్నని, ఇప్పుడు తానే రచయితనయ్యానని, తాను రాసేది నిర్మాతకు నచ్చాల్సి ఉంటుందని ఇదో కొత్త అనుభూతి అని పేర్కొన్నారు.

AR Rahman
99 Songs
Writer
Producer
Music Director
  • Error fetching data: Network response was not ok

More Telugu News