Devineni Uma: ఎంత పనికిమాలినవాళ్లయ్యా మీరు!: వైసీపీ నేతలపై దేవినేని ఉమ ఫైర్

Devineni Uma hits back YSRCP comments over Veligonda

  • ఇంత దిగజారిపోయారా అంటూ విమర్శలు
  • దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపణ
  • వెలిగొండ ప్రాజెక్టు అంశంలో బదులిచ్చిన దేవినేని ఉమ

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ గతంలో జరిగిన ప్రాజెక్టు పనులపై ఇప్పటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. గత ఆగస్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ రెండు కిలోమీటర్ల మేర నిర్మాణం జరుపుకుందని, దాంట్లో 600 మీటర్లే తెలుగుదేశం ప్రభుత్వం చేసిందని విమర్శిస్తున్నారని తెలిపారు. ఎంత పనికిమాలినవాళ్లయ్యా మీరు, ఇంతగా దారుణంగా అబద్ధాలు ఆడేంతగా దిగజారిపోయారా? అంటూ ప్రశ్నించారు.

"ఈ ప్రాజెక్టు టన్నెల్ పనులు చేపట్టిన మొదటి ఏజెన్సీ 3.8 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిపింది. కొత్త ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించిన తర్వాత 2 కిలోమీటర్ల మేర పని జరిగింది. ఇప్పుడా రెండు కిలోమీటర్ల పనిలోనే మేం 1.4 కిలోమీటర్లు చేశాం,  టీడీపీ వాళ్లు 600 మీటర్లే పని చేశారు అంటూ మీరు తెలివితక్కువగా ట్వీట్ చేశారు. అంతే తెలివితక్కువతనంతో మొన్న ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు సమీక్ష సమావేశంలో జబ్బలు చరుచుకున్నారు. మేం వెలుగొండ అంచనావ్యయం రూ.400 కోట్లకు పైగా పెంచాం. మీరు జబ్బలు చరుచుకుంటోంది 1.4 కిలోమీటర్లు టన్నెల్ తవ్వామని. టన్నెల్ తవ్వడం వాస్తవమా, లేకపోతే రూ.414 కోట్లకు పెంచింది వాస్తవమా? రూ.414 కోట్ల అవినీతి అంటున్నారు, దీనికి సమాధానం చెప్పాలి. లేకపోతే ముక్కు నేలకు రాస్తారా? సాక్షి దినపత్రిక మీద చర్యలు తీసుకుంటారా?" అంటూ ప్రశ్నించారు.

Devineni Uma
Veligonda
Tunnel
Jagan
YSRCP
  • Loading...

More Telugu News