Ivanka Trump: ట్రంప్ వెంట ఇండియాకు తనయ ఇవాంకా కూడా!

Ivanka To Accompany Donald Trump On India Visit

  • ఆమె, భర్త కుష్నర్ కూడా వస్తున్నారని అమెరికన్ మీడియా వెల్లడి
  • వారిద్దరూ అమెరికా అధ్యక్షుడికి సీనియర్ సలహాదారులు
  • అత్యున్నత స్థాయి టీమ్ లో భాగంగా వస్తున్నట్టు వార్తలు

భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియాతోపాటు వారి కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్ కూడా రానున్నారు. నాలుగైదేళ్ల కింద హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఇవాంకా వచ్చారు. ఆ సమయంలో అందరి ఫోకస్ ఆమెపైనే పడింది. భారత మీడియా మొత్తం ఆమె చుట్టే తిరిగింది. ఇప్పుడు ఆమె వస్తారన్న వార్తలతో మళ్లీ ఆసక్తి నెలకొంది.

అత్యున్నత స్థాయి టీమ్ లో..

ఇవాంక, కుష్నర్ ఇద్దరూ కూడా అమెరికా అధ్యక్షుడికి సీనియర్ సలహాదారులుగా పదవుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వెంట వచ్చే అత్యున్నతస్థాయి బృందంలో భాగంగా ఇవాంకా, కుష్నర్ కూడా ఇండియా పర్యటనకు వెళ్తున్నారని అమెరికన్ మీడియా వెల్లడించింది. వారితోపాటు యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఓబ్రియాన్, ఆర్థిక శాఖ మంత్రి స్టీవ్ నుచిన్, వాణిజ్య మంత్రి విల్బర్ రాస్, విద్యుత్ శాఖ మంత్రి బ్రోలెట్ వస్తున్నారని పేర్కొంది.

Ivanka Trump
Donald Trump
india visit
Jared kushnar
  • Loading...

More Telugu News