Sheela Movie: 'షీలా' పాత్రలో ఆలియా కాదు.. ప్రియాంకా చోప్రానే!

Not Alia Bhatt Priyanka Chopra finalized to play Ma Anand Sheela in her biopic

  • ఆనంద్ షీలా బయోపిక్ లో నటించనున్న చోప్రా
  • తన పాత్రను ఆలియా భట్  పోషిస్తే చూడాలనుకున్న షీలా
  • అమెజాన్ నిర్మించే ఈ సినిమాకు షీలా అనే టైటిల్

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిన ప్రియాంకా చోప్రా మరో క్రేజీ ప్రాజెక్ట్ ను సొంతం చేసుకుంది. లెజెండరీ బాక్సర్ మేరీకోమ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన మేరీకోమ్ లో టైటిల్ రోల్ పోషించిన ప్రియాంక.. ఇప్పుడు  మరో బయోపిక్ లో నటించనుంది. ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన ఓషో మూవ్ మెంట్ (రజనీష్ ఉద్యమం) అనే వివాదాస్పద ఆధ్యాత్మిక సంఘం మాజీ అధికార ప్రతినిధి అయిన మా ఆనంద్ షీలా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో నటించనుంది.

షీలా కోరుకున్నా..

ఈ బయోపిక్ లో నటించాలని ఉందని ప్రియాంకా చోప్రా గతేడాదే ప్రకటించింది. అయితే తన పాత్రను ఆలియా భట్ పోషిస్తే చూడాలని ఆనంద్ షీలా కోరుకున్నారు. దీంతో ఎవరికి అవకాశం ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. చివరిగా ఈ బయోపిక్ కోసం ఆలియాను కాదని ప్రియాంకా చోప్రానే ప్రధాన పాత్రకు ఎంపిక చేసినట్టు హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అమెజాన్ నిర్మించే ఈ సినిమాకు షీలా అనే టైటిల్ ను ఖరారు చేశారు.

Sheela Movie
Alia Bhatt
Priyanka Chopra
Ma Anand Sheela
Biopic
Movie
  • Loading...

More Telugu News