Suraj Lata Devi: భారత్ కు ఎన్నో విజయాలు అందించిన హాకీ క్రీడాకారిణికి వరకట్న వేధింపులు

Former women hockey skipper complains police over husband

  • పోలీసులను ఆశ్రయిచిన మాజీ కెప్టెన్ సూరజ్ లతా దేవి
  • భర్త చిత్రహింసలు పెడుతున్నాడని ఫిర్యాదు
  • తనకు దక్కిన అర్జున అవార్డును అవహేళన చేస్తున్నాడని వెల్లడి

భారత మహిళల హాకీ జట్టుకు మూడు పసిడి పతకాలు సాధించిన అర్జున అవార్డు గ్రహీత సూరజ్ లతా దేవి ఇప్పుడు వరకట్న బాధితురాలైంది. తనపై భర్త వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడని ఈ జాతీయ మాజీ కెప్టెన్ గువహటి పోలీసులను ఆశ్రయించింది.

2005లో సూరజ్ లతా దేవి వివాహం శాంతకుమార్ తో జరిగింది. అప్పటినుంచి అధిక కట్నం కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వాపోయింది. తాను దక్కించుకున్న పతకాలను చూపిస్తూ వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటూ ఎగతాళి చేస్తున్నాడని, అర్జున అవార్డు కూడా ఏదో అనైతిక కార్యకలాపాల వల్ల వచ్చిందంటూ దారుణంగా మాట్లాడుతున్నాడని తన ఫిర్యాదులో వెల్లడించింది.

సూరజ్ లతా దేవి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, అప్పట్లో షారుఖ్ ఖాన్ హీరోగా అమ్మాయిల హాకీ నేపథ్యంలో వచ్చిన చిత్రం చక్ దే ఇండియా ఎంతటి ఘనవిజయం సాధించిందో గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు స్ఫూర్తి ఎవరో కాదు సూరజ్ లతా దేవినే. ఆమె జీవితంలోని అనేక ఘట్టాల ఆధారంగానే ఈ చిత్ర కథకు రూపకల్పన చేశారు.

Suraj Lata Devi
Hockey
Dowry Harassment
Police
Guwahati
  • Loading...

More Telugu News