SwinFlu: ఇద్దరు ఉద్యోగులకు స్వైన్​ ఫ్లూ.. ఇండియాలో ఆఫీసులు మూసేసిన 'శాప్'

sap offices closed india amid two employees tested positive for h1n1

  • కరోనా వైరస్ నేపథ్యంలో ఆందోళన
  • ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగులకు ఆదేశం
  • ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని ప్రకటన

అసలే కరోనా వైరస్ భయంతో గడగడలాడుతున్న సమయంలో బెంగళూరులోని తమ ఉద్యోగులు ఇద్దరికి స్వైన్ ఫ్లూ (హెచ్1 ఎన్1 వైరస్) రావడంతో జర్మనీ సాఫ్ట్ వేర్  కంపెనీ ‘శాప్’ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లోని బెంగళూరుతో పాటు ముంబై, ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ లో ఉన్న తమ ఆఫీసులను కొన్ని రోజుల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఉద్యోగులంతా ఇళ్ల నుంచే పని చేయాలని సూచించింది. శాప్ కంపెనీ బిజినెస్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ను అందిస్తుంటుంది.

ఉద్యోగుల ఆరోగ్యమే ముఖ్యం

తమ కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని శాప్ కంపెనీ ప్రకటించింది. బెంగళూరులోని తమ ఆఫీసులో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు స్వైన్ ఫ్లూ సోకినట్టు తేలిందని, అది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని తెలిపింది. మళ్లీ సమాచారం ఇచ్చే వరకు ఉద్యోగులందరినీ ఇళ్ల నుంచి పని చేయాల్సిందిగా సూచించామని తెలిపింది.

  • Loading...

More Telugu News